చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్

రూ.6 లక్షల విలువైన ఆభరణాలు, నగదు స్వాధీనం కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ నగరంలోని కేయూసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను శనివారం పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుండి రూ.6 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. కేయూసీ సీఐ ఎస్‌. రవి కుమార్ వివరాల ప్రకారం.. సెండే అరుణ్ కుమార్ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యేందుకు 2024లో హనుమకొండకు వచ్చాడు. చదువుతో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై అప్పులు చేసి, వాటిని తీర్చేందుకు రాత్రివేళల్లో ఇళ్లలో...