ఎస్సై ఆత్మహత్య

కుటుంబ కలహాల నేపథ్యంలో విషాద ఘటన కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట డివిజన్ పరిధిలో ఓ పోలీసు అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఎండీ. ఆసిఫ్ (57) కుటుంబ సమస్యలతో ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సంపేట పట్టణంలోని వల్లభ్ నగర్‌లో నివసిస్తున్న ఆసిఫ్, శుక్రవారం విధులకు హాజరైన తర్వాత రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను సహచరులు వెంటనే వరంగల్ ఎంజీఎం...