వరద నష్టంపై సర్వే పూర్తి చేయాలి
రోడ్ల మరమ్మతులు వేగవంతం చేయాలి పునరుద్ధరణ చర్యలు చేపట్టండి అధికారులను ఆదేశించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కాకతీయ, వరంగల్ బ్యూరో : వరదల ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో సర్వేను త్వరగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శనివారం హనుమకొండలోని సమ్మయ్యనగర్, అమరావతి నగర్ ప్రాంతాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరదలతో నష్టపోయిన ప్రతీ ఇంటిని తప్పకుండా సర్వే చేయాలని, నివేదిక ఆధారంగా నష్ట పరిహారం...