అర్బ‌న్ బ్యాంకు విజేత ఎవ‌రు..?!

క‌రీంన‌గ‌ర్ వ్యాపార వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ నెల‌కొన్న ఆస‌క్తి స‌భ్యుల మ‌ద్ద‌తు ఎవరికి ద‌క్కింది.. మ‌రి కొద్ది గంట‌ల్లో తేల‌నున్న ఫ‌లితం కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : కరీంనగర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికల ఫ‌లితం మ‌రికొద్దిసేప‌ట్లో తేలిపోనుంది. మూడు బలమైన ప్యానల్స్ పోటీలో ఉన్నాయి. మొత్తం 9,287 మంది ఓటర్లలో 7,272 మంది కరీంనగర్ పరిధిలో, 2,015 మంది జగిత్యాల పరిధిలో ఉండ‌గా ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మహిళల భాగస్వామ్యం కూడా గణనీయంగా కనిపించింది....