స్లాట్ విధానంతోనే పత్తి కొనుగోళ్లు
స్లాట్ విధానంతోనే పత్తి కొనుగోళ్లు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాకతీయ, కరీంనగర్ : పత్తి కొనుగోళ్లు కేవలం స్లాట్ విధానంలోనే జరుగుతున్నాయని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. ఆదివారం ఇల్లంతకుంట మండల కేంద్రంలో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల సౌకర్యార్థం స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నదన్నారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలు నివారించడమే లక్ష్యమని తెలిపారు....