విత్తన చట్టం’లోపాలు సరిచేయాలి

విత్తన చట్టం’లోపాలు సరిచేయాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సెక్రటేరియట్ లో తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం-2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమావేశం అయ్యారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధివిధానాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరం అని, వ్యవసాయం ఉద్యానవనంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రావడం వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారని తెలిపారు. విత్తన చట్టం...