ఘనంగా ‘పూర్వ విద్యార్థుల సమ్మేళనం’

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ నగరంలోని శంభునిపేటలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 టెన్త్ క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులు ఈ సమ్మేళనం వేడుకల్లో కలుసుకొని తాము చదువుకున్న రోజులను గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. తమకు పాఠాలను బోధించిన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రస్తుతం...