‘ఆర్ఎంపీ’ నియోజకవర్గ కమిటీ ఎన్నిక
కాకతీయ, పాలకుర్తి : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట ఆర్ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. ప్రగతి విద్యానిలయం ఆవరణలో ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట ఉపాధ్యక్షుడు పెందోటి వెంకటాచారి, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపురం వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం మండలకేంద్రంలోని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొర్రూర్, రాయపర్తి, పెద్దవంగర అధ్యక్షులుగా లొంక మల్లేష్, మేకపోతుల...