ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ
ఒకరికి తీవ్రగాయాలు కుటుంబసభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం కాకతీయ, వరంగల్ బ్యూరో : ఖమ్మం, వరంగల్ జాతీయ రహదారిపై మరోసారి గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. తొర్రూరు మండలంలోని నాంచారిమడూరు గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి కాకినాడ పోర్ట్ వైపు వెళ్తున్న గ్రానైట్ లారీ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న లక్ష్మీ అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా, ఆమెను వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన...