ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాకతీయ, పినపాక: పినపాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని గోపాలరావుపేట, తోగూడెం గ్రామాల నుంచి 60 కుటుంబాలు స్థానిక కాంగ్రెస్ నాయకులు అచ్చా నవీన్, డొంకెన సాంబశివరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరాయి. ఈ సందర్భంగా వారందరికీ ఎమ్మెల్యే పాయం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలనతో నిజమైన పేదలకు, మధ్య తరగతి కుటుంబాలకు...