ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. కొణిజర్ల మండలానికి చెందిన నారీ మహిళా సేవా సంఘం సభ్యులు తమకు స్వయం ఉపాధి కల్పించాలని...