‘వినతులు’ త్వరితగతిన పరిష్కరించాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ దివాకర అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో 46 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 13, భూ సమస్యలు 08, పెన్షన్ 05, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 20 దరఖాస్తులు స్వీకరించారు. వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి...