పంట నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిస్తాం

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కాకతీయ,రాయపర్తి : మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిస్తామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. మండలంలోని కొండూరు గ్రామంలో సోమవారం ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు. ధాన్యాన్ని...