గవర్నర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 7న శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గవర్నర్ పర్యటనలో ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని సూచించారు. డయాస్, సీటింగ్, స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా కలెక్టర్ సూచనలు చేశారు. యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని,...