అడవి పందుల దాడిలో రైతు దుర్మరణం

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామంలో బుధవారం ఉదయం అడవి పందుల దాడిలో రైతు దుర్మరణం చెందిన‌ ఘటన గ్రామంలో విషాదాన్ని నెలకొల్పింది. స్థానిక రైతు కుందురు వెంకటేశ్వర రెడ్డి (65) తమ పొలానికి వెళ్లి పంటను పరిశీలిస్తుండ‌గా అకస్మాత్తుగా అడవి పందుల గుంపు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ప్రతీ ఉదయం లాగానే వెంకటేశ్వర రెడ్డి తమ పొలానికి వెళ్లి పంట పరిస్థితిని పరిశీలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దాడి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన తీవ్ర...