గుగులోత్ ధర్మ సేవలు చిరస్మరణీయం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం గుగులోత్ ధర్మ నిర్వహించిన ఉద్యమాలు నేటితరానికి ఆదర్శమని, ఆయనలేని లోటు తీర్చలేనిదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఎం సీనియర్ నాయకుడు, గిరిజన నేత గుగులోత్ ధర్మ ద్వితీయ వర్ధంతి సందర్బంగా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన ధర్మ విగ్రహావిష్కరణ, సంతాపసభలో అయన పాల్గొని మాట్లాడారు. గుగులోత్ ధర్మ ఉమ్మడి ఖమ్మం జిల్లా...