దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

వెండి, బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం కాకతీయ, హుజురాబాద్: జమ్మికుంట పట్టణ పోలీసులు చాకచక్యంగా వరుస దొంగతనాల నిందితుడిని అరెస్టు చేశారు. మోతుకూలగూడెం శివారులో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సీఐ రామకృష్ణ గౌడ్ బృందం, అనుమానాస్పదంగా వెళ్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా నిందితుడు చిక్కాడు. ఆటోలో ఎరుపు రంగు గడ్డపార కనిపించడంతో పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతను జమ్మికుంట హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సోమ సారయ్య (58) అని తేలింది. విచారణలో 2010లో భార్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించి,...