ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో స్కూల్ కు చెందిన విద్యార్థులు ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం క్రీడలను వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు అన్ని వనరులు కల్పిస్తున్నామని తెలిపారు. ఇటీవల హుజురాబాద్‌లోని జెడ్ పి హెచ్ ఎస్ మైదానంలో జరిగిన ఎస్ జి ఎఫ్ జోనల్...