పారిశుధ్య పనులపై కమిషనర్ పర్యవేక్షణ
కాకతీయ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుక్రవారం కరీంనగర్ పర్యటనకు రానుండటంతో నగరంలో పారిశుధ్య పనులు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ పారిశుధ్య పనులు, గవర్నర్ రూట్ మ్యాప్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అలుగునూర్, ఎన్టీఆర్ జంక్షన్, బద్ధం ఎల్లరెడ్డి జంక్షన్, కామన్, వన్ టౌన్ జంక్షన్, బస్టాండ్, ప్రతిమ చౌరస్తా, గీతాభవన్, రాంనగర్, చింతకుంట జంక్షన్ నుంచి శాతవాహన విశ్వవిద్యాలయం వరకు గవర్నర్ రూట్‌లోని రహదారులను కమిషనర్ తనిఖీ చేశారు....