వ్యక్తిగత సమాచారం లేదా డబ్బును కాజేయడమే సైబ‌ర్ నేర‌గాళ్ల ల‌క్ష్యం

హుజురాబాద్‌ ఎస్సై యూనస్ అలీ కాకతీయ, హుజురాబాద్ : పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని హుజూరాబాద్ సబ్‌–ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎస్సై) యూనస్ అలీ సూచించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని హైస్కూల్ మైదానంలో వాకర్స్‌కు సైబర్ నేరాలపై అవగాహన క‌ల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై యూనస్ అలీ మాట్లాడుతూ.సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నార‌ని తెలిపారు. పోలీసులు ప్రజల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత అప్రమత్తత మాత్రమే ప్రధాన రక్షణ అని చెప్పారు....