ఐటీఐ కళాశాలకు నిధుల విడుద‌ల‌పై హ‌ర్షం

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణకు కృతజ్ఞతలు కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల అభివృద్ధికి రూ.1 కోటి నిధులు మంజూరవ్వడంతో పట్టణ ప్రజానీకం, వాకర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ ఎన్నికల హామీని నెరవేర్చుతూ వాకర్స్ కోసం నూతన వాకింగ్ ట్రాక్, హైమాస్ట్ లైట్లు, టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున నిధులు మంజూరు చేశారు.నిధుల మంజూరుతో ఉత్సాహభరితులైన వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పట్టణ ప్రజలు...