అమరుల ఆశయాలను కొనసాగిద్దాం
సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్న కాకతీయ, నెల్లికుదురు : పేద ప్రజల కోసం మహబూబాబాద్ శివారు ప్రాంతంలో పోలీసుల భూటకపు ఎన్కౌంటర్ లో అమరుడైన బట్టు అంజయ్య అలియాస్ సురేశన్న ఆశయాలు కొనసాగించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ఉడుగుల లింగన్నపిలుపినిచ్చారు. గురువారం నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో అమరవీరుల సంస్కరణ వారోత్సవాల సభ నిర్వహించారు. అందులో భాగంగా సురేషన్న స్తూపం వద్ద, అల్లేరు గ్రామంలో అమరుడు గుదే గణపతి స్తూపం వద్ద జెండాను ఆవిష్కరించి...