విద్యార్థులను గోస పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం

బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు కాకతీయ, కరీంనగర్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించ‌కుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను, యాజమాన్యాలను గోస పెడుతోందని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. గురువారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడిచినా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించే వరకు కళాశాలలు బంద్ కొనసాగుతాయనే యాజమాన్యాల ప్రకటనతో విద్యార్థులు అకాడమిక్ ఇయర్‌ను కోల్పోయే...