నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కాకతీయ, కరీంనగర్ : మొంథా తుఫాన్ ప్రభావంతో చొప్పదండి నియోజకవర్గంలో పంటలు భారీగా దెబ్బతిన్నాయని, రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు....