అట్టహాసంగా జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
జ్యోతి వెలిగించి ప్రారంభించిన కలెక్టర్ పమేలా సత్పతి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం దేవంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 11వ జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్–2025 గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జ్యోతి వెలిగించి క్రీడా సమారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభ పాఠవాలను వెలికితీయడంలో ఇలాంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. చదువుతో పాటు...