15కల్లా బిల్లులు ఇవ్వండి! జీడబ్ల్యూఎంసీ కాంట్రాక్టర్ల విజ్ఞప్తి

15కల్లా బిల్లులు ఇవ్వండి! జీడబ్ల్యూఎంసీ కాంట్రాక్టర్ల విజ్ఞప్తి 15వ తర్వాత సమ్మె చేస్తామని హెచ్చరిక కాకతీయ, వరంగల్: వరంగల్ మహానగరంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల బిల్లులను ఈ నెల 15వ తేదీలోగా చెల్లించాలని జీడబ్ల్యూఎంసి పరిధిలోని హనుమకొండ, వరంగల్ సివిల్ కాంట్రాక్టర్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతిపత్రం సమర్పించారు. 15వ తేదీలోగా బిల్లులు చెల్లించుకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని వినతిపత్రంలో హెచ్చరించారు. నాలుగు దశాబ్దాలుగా నగరాభివృద్ధిలో సుమారు 400 మంది చిన్న, మధ్య...