28 కోట్లతో ‘సమీకృత ప్రభుత్వ కార్యాలయాలు’
నిర్మాణ స్థలాన్ని పరిశీంచిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాకతీయ, నర్సంపేట: నర్సంపేట డివిజన్ సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించుటకు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆయన మాట్లాడుతూ దాదాపు 28 కోట్ల రూపాయల తో నర్సంపేట డివిజన్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయలు రెవిన్యూ డివిజనల్ అధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, ఏడీఏ, ఎంఈఓ, సబ్ రిజిస్టార్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని ఒకే చోట నిర్మాణం చేసి ప్రజలకు అన్ని కార్యాలయాలు...