సానుభూతి ఓట్లకు కేటీఆర్ పాకులాట
గోపీనాథ్ మృతిపై తల్లి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రెవెన్యూ, హౌసింగ్, సమాచారశాఖ మంత్రి పొంగులేటి కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిలను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర రెవెన్యూ ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి, రెహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్ తో సహా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. బోరబండలోని సాయిబాబానగర్,జూబ్లీహిల్స్...