వందేమాతరం స్మారకోత్సవంలో భాగస్వాములవ్వాలి
మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే తక్కలపల్లి రాజేశ్వరరావు కాకతీయ, హన్మకొండ : వందేమాతరం స్మారకోత్సవంలో ప్రజలంతా భాగస్వాములవ్వాలని వరంగల్ మాజీ మేయర్ తక్కలపల్లి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా కేంద్రంలో దొంతి దేవేందర్ రెడ్డి జిల్లా కన్వీనర్ ఆధ్వర్యo లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కాలేజీ జంక్షన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ మాజీ ఎమ్మెల్యే తక్కలపల్లి రాజేశ్వరరావు...