ముంపు బాధిత విద్యార్థులకు అండగా..తుమ్మల యుగంధర్
ముంపు బాధిత విద్యార్థులకు అండగా..తుమ్మల యుగంధర్ విద్యార్థుల కు నోట్ బుక్స్, బ్యాగులు పంపిణీ చిన్నారులతో సహపంక్తి భోజనం కాకతీయ,ఖమ్మం ప్రతినిధి: ఇటీవల అకాల వర్షాల ప్రభావంతో జలగం నగర్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ముంపునకు గురై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవనం నీటిలో మునిగిపోవడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కలిసి స్కూల్‌ను సురక్షిత ప్రాంతానికి మార్చమని విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పాఠశాలను అరెంపులలోని మహమ్మదీయ కాలేజీ వద్దకు తరలించారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ...