కొత్తూరు లంబాడీ జేఏసీ ఎన్నిక
కాకతీయ, ఖానాపురం : ఖానాపురం మండలం కొత్తూరు గ్రామ లంబాడీ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఖానాపురం లంబాడీ మండల జేఏసీ కన్వీనర్ గుగులోతు కిషన్ నాయక్, ముఖ్య సలహాదారులు జాటోత్ బాలు నాయక్, బాదావత్ బాలకిషన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్నాళ్లు అన్నదమ్ముల్ల కలిసి మెలిసి ఉన్న ఎస్టి కులాల మధ్య విభేదాలను సృష్టించాలని రాష్ట్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తుందని, దీనిని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో లంబాడీ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు....