ప్రాణాలు తీస్తున్న పైపులు!

ప్రమాదకరంగా ఏనుమాముల మార్కెట్ వంద ఫీట్ల రోడ్డు ప్రాణాంతకంగా డివైడర్ స్థానంలో వేసిన పెద్దపెద్ద పైపులు ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని బల్దియా ఇంజినీరింగ్ అధికారులు ప్రజలు మృతిచెందుతున్నా స్పందించని జీడబ్ల్యూఎంసీ పాలకులు ఇంకెంతమంది చనిపోతే పట్టించుకుంటారని ఆగ్రహిస్తున్న ప్రజలు కాకతీయ, వరంగల్ : కాలాతీత పనులతో ప్రజలు కాలం చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. వరంగల్ మహానగరంలో ఆరేండ్ల క్రితం చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేయడం ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతోంది. రోడ్డు మధ్యలో వదిలేసిన పెద్దపెద్ద సొరంగాల్లాంటి సిమెంట్ పైపులు జీవితాలను మింగుతున్నాయి. స్థానికంగా నివసించే...