లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి.

లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి. కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. తాడ్వాయి సమీపంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న చిటమట రాజు, విష్ణు అనే ఇద్దరిని వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ చిటమట రాజు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తోటి డ్రైవర్ విష్ణు తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలించారు. అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించుకోలేక...