ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్య తీసుకోవాలి
ఫుడ్ పాయిజన్ బాధ్యులపై చర్య తీసుకోవాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట బాలికల పాఠశాలలో 26 మందికి అస్వస్థత కాకతీయ, కరీంనగర్ : జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం భోజనం వికటించడంతో 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురికి వాంతులు, తలనొప్పి, విరేచనాలు కావడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక పరీక్షల్లో తేలికపాటి ఫుడ్ పాయిజన్ లక్షణాలు ఉన్నాయని, అందరూ ప్రమాదం నుంచి...