నల్లగొండలో ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు

నల్లగొండలో ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు కలెక్టర్ జోక్యం చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకున్నారని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 30/186, 187లలో ఉన్న ప్రభుత్వ భూమి బీసీ ఇళ్ల స్థలాలుగా ప్రభుత్వ రికార్డుల్లో స్పష్టంగా నమోదై ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఆ భూమిని దున్ని సాగు చేస్తున్నారని వారు తెలిపారు.గ్రామస్థులు చెబుతున్న వివరాల ప్రకారం, గతంలోనే...