చెరువులో మోటార్లు తొలగించాలని మత్స్యకారుల విజ్ఞప్తి

చెరువులో మోటార్లు తొలగించాలని మత్స్యకారుల విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా రాగంపేట రేవెల్లి గ్రామానికి చెందిన చెరువు పారకం ఆయకట్టు రైతులు, మత్స్య పారిశ్రామిక సంఘం సభ్యులు కలసి చెరువులో ఉన్న మోటర్లను తొలగించాలంటూ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించారు.వారి వివరాల ప్రకారం.దేశాయిపేట గ్రామానికి చెందిన కొందరు రైతులు చెరువులో సుమారు 30 మోటర్లు బిగించి పైపులైన్ల ద్వారా నీటిని వాడుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే ఇరిగేషన్‌, విద్యుత్‌ శాఖలతో పాటు ఎంఆర్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం...