రాజిరెడ్డి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ దయనీయ స్థితి
రాజిరెడ్డి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ దయనీయ స్థితి సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన కాలనీ వాసులు కాకతీయ, కరీంనగర్ : విద్యానగర్ సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నెం.5 రాజిరెడ్డి కాలనీ వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారులు గుంతలతో నిండిపోవడం, డ్రైనేజీ కాలువలు తరచూ మూసుకుపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకీ చేరిపోతుంది. దాంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.కాలనీలో దాదాపు 200కు పైగా ఇళ్లు...