అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా ‘ఖేల్ ఉత్సవ్’
అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఘనంగా ‘ఖేల్ ఉత్సవ్’ కాకతీయ, కరీంనగర్: అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ‘ఖేల్ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి పెంపొందించడంతోపాటు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ఉత్సవ లక్ష్యమని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని, పాఠశాల స్థాయిలోనే శిక్షణ అందిస్తూ ఉన్నత స్థాయి పోటీలకు ఎంపిక చేసేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయుల ద్వారా...