ఈవీఎం గోదాం పరిశీలించిన అధికారులు

ఈవీఎం గోదాం పరిశీలించిన అధికారులు కాకతీయ, కరీంనగర్ : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డిఆర్ఓ బి. వెంకటేశ్వర్లు, ఆర్డిఓ కె. మహేశ్వర్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు.డిఆర్ఓ బి. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈవీఎంలు, వివిప్యాట్ల భద్రతా ఏర్పాట్లను తరచూ తనిఖీ చేసి సమగ్ర నివేదికలను పంపిస్తున్నామని తెలిపారు. గోదాంలో ఉన్న భద్రతా సిబ్బందితో మాట్లాడి రక్షణా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు, డ్యూటీ...