కట్టరాంపూర్ రోడ్డుపై మహిళల ధర్నా
కట్టరాంపూర్ రోడ్డుపై మహిళల ధర్నా రోడ్డు బాగు చేయకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిక కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కట్టరాంపూర్ ప్రాంతంలో బుధవారం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టరాంపూర్ నుంచి కోతిరాంపూర్ వరకు ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసమైందని, గుంతలతో నిండిపోయి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు...