“వందేమాతరం” స్వరంలో దేశభక్తి జ్వాలలు
“వందేమాతరం” స్వరంలో దేశభక్తి జ్వాలలు స్వాతంత్ర సమరయోధుల రణనినాదం భారతీయులలో స్ఫూర్తి నింపిన గేయం హుజురాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా వందేమాతరం గేయాలాపన కాకతీయ,హుజురాబాద్ :భారతీయుల్లో దేశభక్తి, చైతన్యాన్ని రగిలించిన "వందేమాతరం" గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాల భాగంగా బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో వందేమాతరం గేయాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.వందేమాతరం గేయం భారత...