డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో పాఠ్యాంశాలపై అవగాహన పెంపొందుతుందని మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ అన్నారు. మండల కేంద్రంలోని నెల్లికుదురు ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ను శుక్రవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రొజెక్టర్ను అందుబాటులోకి తెచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధన విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతుందని విద్యార్థుల్లో విషయ జ్ఞానాన్ని పెంపొందించేందుకు...