రామప్ప ఆలయానికి నెదర్లాండ్ దంపతులు
రామప్ప ఆలయానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా పాలంపేట రామప్ప దేవాలయం విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా నెదర్లాండ్‌కు చెందిన పర్యాటకులు జోహన్, హలేన్ దంపతులు రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయానికి చేరుకున్న విదేశీ అతిథులు పూజలు నిర్వహించగా, అర్చకులు హరిష్ శర్మ, ఉమా శంకర్ తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవాలయ చరిత్ర, కట్టడ నిర్మాణ శైలి, శిల్పకళ ప్రాముఖ్యతను టూరిజం గైడ్ విజయ్ కుమార్ విపులంగా వివరించారు....