సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం
సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధం రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి కాకతీయ, కొత్తగూడెం: సామాజిక ఐక్యతే అభివృద్ధికి మూలమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం పలు ప్రాంతాల్లో సామాజిక వర్గాలు నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రపురం గ్రామపంచాయతీ పరిధిలోని పాపారావు మామిడి తోటలో...