బీసీల హక్కులు బీసీలకే దక్కాలి
బీసీల హక్కులు బీసీలకే దక్కాలి జమ్మికుంట సదస్సును విజయవంతం చేయండి నాయకుల పిలుపు కాకతీయ, హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ల కోసం ఈనెల 29న దినేష్ కన్వెన్షన్‌లో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ రిజర్వేషన్ సదస్సుకు విస్తృత ప్రచారం మొదలైంది. హుజురాబాద్ అంబేద్కర్ కూడలిలో సదస్సుకు సంబంధించిన వాల్‌పోస్టర్, కరపత్రాలను మానవ హక్కుల వేదిక, రాజకీయ పార్టీలు, దళిత ప్రజాసంఘాల నాయకులు కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.తరతరాలుగా విద్య, గౌరవం, సంపద, అధికారాల్లో భాగస్వామ్యం లేకుండా బీసీ కులాలు అణచివేయబడ్డాయని, వ్యవస్థీకృత...