కూతుర్ని చంపి, కొడుకుకి ఉరి వేసిన తండ్రి అరెస్ట్
కూతుర్ని చంపి, కొడుకుకి ఉరి వేసిన తండ్రి అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : ఇద్దరు పిల్లలు అంగవైకల్యాలతో బాధపడుతుండటంతో మానసిక వేదనకు గురైన ఓ తండ్రి ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతుర్ని ఉరివేసి చంపి, కొడుకుపై కూడా అదే పద్ధతిలో హత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్ పట్టణంలో వెలుగుచూసింది. నిందితుడైన అనవేణి మల్లేష్ (38)ను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.2009లో మల్లేష్,పోసవ్వలకు హర్షిత్, హర్షిత అనే ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ చిన్నప్పటి నుంచే మానసిక, శారీరక అంగవైకల్యాలు. నిలోఫర్, ఉస్మానియా, నిమ్స్, బోయినపల్లి నేషనల్ హ్యాండీక్యాప్డ్...