ఘ‌నంగా కార్తిక వనభోజనం

ఘ‌నంగా కార్తిక వనభోజనం క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వ‌హ‌ణ‌ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం కార్తిక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కూకట్ పల్లి ఖైతాలపూర్ మైదానంలో నిర్వహించిన ఈ వన భోజన మహోత్సవంలోపెద్ద ఎత్తున క్షత్రియులు హాజరై సంతోషంగా గడిపారు. కార్తీక మాస విశిష్టతను చాటిచెబుతూ తొలుత ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. అనంతరం అల్లూరి సీతారామరాజు కు ఘనంగా నివాళులర్పించారు. వన భోజన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు...