సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు ఇబ్బందులు
సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో పత్తి రైతులకు ఇబ్బందులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కాకతీయ, గీసుగొండ: రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచెర్లలో మహిళా రైతు అచ్చ శోభ పత్తి పంటను పరిశీలించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..సీసీఐ తుగ్లక్ నిర్ణయాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని,కొనుగోలు కేంద్రాల్లో అనవసరమైన అడ్డంకులు సృష్టించడం వల్ల పత్తి రైతులు అయోమయంలో ఉన్నారని...