నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన దాతలు మానవత్వం మిగిలే ఉందని చాటిన ఖిలావరంగల్ ప్రజలు కాకతీయ, ఖిలావరంగల్: ఖిలావరంగల్ తూర్పు కోటకు చెందిన సంకతల కోమల అనారోగ్యంతో ఇటీవల మృతిచెందిన ఘటన స్థానికంగా విషాదాన్ని రేపింది. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించడంతో కోమల ఒక్క కుమారుడిని పెంచుకుంటూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగించింది. పెఱిక కులానికి చెందిన ఈ నిరుపేద మహిళకు ఉండటానికి కూడా సరైన ఇల్లు లేకపోవడం గ్రామస్తులను మరింత కలచివేసింది. ఈ పరిస్థితిని గమనించిన బీజేపీ నాయకుడు కందిమల్ల మహేష్...