మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ
మహాత్మా నగర్‌లో శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ 21 నుంచి మహోత్సవాలు కాకతీయ, కరీంనగర్ : తిమ్మాపూర్ మండలం మహాత్మా నగర్ (ఎల్‌ఎండి) గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్ర ప్రతిష్ఠా మహోత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 21 నుండి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న మహాకుంభాభిషేక, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు దేవాలయ ప్రాంగణం భక్తజనంతో కోలాహలంగా మారనుంది. అయ్యప్ప, గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, పార్వతీదేవి, నవగ్రహ, శిఖరధ్వజ సహా వివిధ దేవతామూర్తుల ప్రతిష్ఠ కోసం అన్ని ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి.హంపి...